తిరుపతి, నవంబర్ 12: పశు వైద్య కళాశాలలు బ్రీడ్ పెంపు, ఫీడ్, పశు గ్రాసం, పశు వైద్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, రైతులకు తమ పొలం ద్వారా ఒక నిర్దిష్ట ఆదాయం మాత్రమే వస్తుందని, అదనపు ఆదాయ మార్గాలు పశు సంవర్థక అనుభంధ శాఖల తో మాత్రమే సాధ్యమవుతుందని గుర్తించాలని రాష్ట్ర పశు సంవర్థక, పాడి మరియు మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.

గురువారం స్థానిక శ్రీ వేంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయ క్షేత్ర స్థాయి పర్యటనలో మంత్రి, శ్రీకాళహస్తి శాసన సభ్యులు బియ్యపు మధుసూధన రెడ్డి, తంబళ్లపల్లి శాసన సభ్యులు ధ్వారక నాధ రెడ్డి పాల్గొన్నారు.

పశు సంవర్థక శాఖ మంత్రి ముందుగా విశ్వవిద్యాలయ ఆవరణలోని పశు గ్రాస క్షేత్రంలో ఏర్పాటు చేసిన క్షేత్ర స్థాయి పర్యటనలో ఉన్న మహిళా రైతుల శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి కటాక్షంతో నేడు ఇక్కడ పర్యటిస్తున్నానని అన్నారు.

పచ్చ గడ్డి మేపుతోనే ఎక్కువగా పశువులు ఆరోగ్యవంతంగా ఉంటాయని, దీనిని ఆద్యాపకులు గుర్తించి రైతులు అవగాహన కల్పించాలని అన్నారు. రైతు తమకు ఉన్న భూమిలో కొద్ది పాటి పశు గ్రాసం పెంపు దృష్టి పెట్టాలని అన్నారు.

ఇక్కడ ఉచితంగా ఇచ్చే గ్రీన్ పాడర్ మొక్కలు నాటిన 45 రోజులకు పచ్చ గడ్డిని కటింగ్ చేసి గ్రాసాన్ని పశువులకు అందించే వీలుంటుందని , ఈ పశుగ్రాస మొక్క విత్తనాలు కనీసం నాలుగు సంవత్సరాల కాలం పెరుగుతుంటుందని అన్నారు.

గ్రీన్ పాడర్ విత్త మొక్కలను క్షేత్ర పర్యటనలో వున్న ఉడమలపాడు మహిళా రైతులకు గడ్డి మొక్కలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా యూనివర్సిటీ యాజమాన్యం మంత్రికి నెల్లూరు జాతి బ్రౌన్ పొట్టేలు పిల్లను బహుమతిగా అందించారు.

అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ డాక్టర్ల, అస్సిస్టెంట్ల నిరంతర శిక్షణా కార్యక్రమాన్ని మంత్రి యూనివర్శిటీ పశు వైద్య చికిత్స సముదాయ సమావేశ మందిరంలో జ్యోతిని వెలిగించి ప్రారంభించారు.

ఈ శిక్షణా కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి దేశ రాష్ట్ర అభివృద్ధిని లెక్కించాలంటే పశువులు ఆరోగ్య స్థితి తో పోల్చవచ్చని సమావేశాల్లో సూచిస్తారని అన్నారు.

ముఖ్యమంత్రి రైతుల ఆదాయాన్ని పెంపే లక్ష్యంగా ప్రాధాన్యత నిస్తున్నారని అన్నారు. బ్రీడ్ ఉత్పత్తి , ఫీడ్, పాడర్, వెటర్నరీ కేర్ పై అధ్యాపకులు , వైద్య విధ్యార్థులు ప్రత్యేక శ్రద్ధ అవసరమని అన్నారు.

గతంలో మందులు, వాక్సిన్ వంటివి కొరతలు ఇప్పుడు లేవని, రైతులకు ప్రతి సంవత్సరము వారి ఆదాయం పెంచేలాగా కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో భోధనలు, శిక్షణాలు ఉండాలని సూచించారు. ప్రాథమిక పశువైద్యశాల పరిధిలో కనీసం నేడు 4, 5 సచివాలయాలు ఉన్నాయని వెటర్నరీ అస్సిస్టెంట్లు అందుబాటులో ఉంటారని,

ప్రతి 1000 పశువులకు ఒక అస్సిస్టెంట్ ఉంటారని అన్నారు. రైతులకు అవగాహన, పశువులకు మెరుగైన చికిత్స అందించేలా చూడాలని అన్నారు. ఈ నెల 25 దేశంలోని అత్యంత ప్రముఖ కంపెనీ అమూల్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నారని, రైతులకు పాల వల్ల మరింత ఆదాయం పెరగనున్నదని అన్నారు.

మనలో జవాబుదారీతనం, భాధ్యత పెరిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయని అన్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు శిక్షణ , అవగాహన కల్పించే ప్రచార వాహనం , పశువులకు చికిత్స లందించే ఆంబులెన్సుల పని తీరు పరిశీలించారు.

శ్రీకాళహస్తి , తంబళ్లపల్లి శాసనసభ్యులు బియ్యపు మధుసూధన రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారక్ నాథ్ రెడ్డి, మంత్రిని ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ విసి పద్మనాభ రెడ్డి, జె. డి. పశు సంవర్థక శాఖ వెంకట్రావు , టీచింగ్ , నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు