అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం కేవలం 40 ఏళ్లలోపు మహిళలకే ప్రాధాన్యం ఇచ్చిందని విమర్శించారు. మధ్య వయస్కులు, కుటుంబాలను పోషించుకుంటున్న.. మహిళలకు ఎలాంటి ఆదరణ లేదన్నారు. వైఎస్సార్‌ చేయూత రెండో విడతలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూ.510 కోట్లు కేటాయించారని తెలిపారు. మహిళలు ఆర్ధికంగా ఎదిగేలా ప్రత్యేక శిక్షణ ఇస్తామని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

 

మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ వైఎస్సార్‌ చేయూత పథకం డబ్బును నేరుగా మహిళల ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. మహిళలు స్వశక్తితో ఎదిగాలనే ఈ పథకం అమలు చేస్తున్నట్లు మంత్రి అన్నారు. మేనిఫెస్టో తమకు భగవద్గీతని.. సీఎం జగన్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారన్నారు. మహిళల కోసం కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని మంత్రి బొత్స తెలిపారు.