వార్తలు (News)

సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్త కుంభకోణం..ప్రభగిరిపట్నం కొండలను మింగేసిన అనకొండ..

 

దశావతారం సినిమాలో కమలహాసన్ కు మించి కాకాణి నటన…

సర్వేపల్లిలో కాకాణి ప్రైవేటు సైన్యంగా పోలీసులు

ఎన్నికలకు ముందు ప్రభగిరిపట్నం వాసులకు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇచ్చిన మాటకు సంబంధించిన వీడియోతో పాటు ఆ కొండలపై ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన ఫొటోలను ప్రదర్శించిన ఏవీఆర్..

నెల్లూరు టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్..

జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు కొత్తకొత్త కోణాల్లో, వినూత్న ఆలోచనలతో ప్రజాధనం దోచుకుంటున్నారు..

డలారి గోవర్ధన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లి నియోజకవర్గంలో కొత్త కుంభకోణం వెలుగులోకి వచ్చింది..

పొదలకూరు మండలం ప్రభగిరిపట్నంలోని చారిత్రాత్మక కొండలను మాయం చేసేశారు..

1500 ఏళ్ల చరిత్ర కలిగిన అక్కడి ఐదు కొండలపై చోళ రాజులు 101 విశేష చరిత్ర కలిగిన ఆలయాలు నిర్మించారు..

ఈ కొండలపై మైనింగ్ కు 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో అనుమతి లభించింది…

సనాతన ధర్మానికి చెందిన ప్రాంతంలో మైనింగ్ వద్దని గ్రామస్తులు చేసిన అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మైనింగ్ కార్యకలాపాలు జరగనీయలేదు..

ఎన్నికలకు ముందు కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభగిరిపట్నం కొండలెక్కి…కొండను కాదు కదా…బండను కూడా తాకనివ్వనని డ్రామాలు వేశారు..

దశావతారం సినిమాలో కమలహాసన్ ను మించి నటించారు..

ఎన్నికలు పూర్తయి అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించేశారు..బండను కూడా కదలనీయనని చెప్పిన గోవర్ధన్ రెడ్డే మైనింగ్ కు తెరలేపారు..

పోలీసులు కాకాణి ప్రైవేటు సైన్యంగా అవతారమెత్తి ఆ ఊళ్లపైడి కలెక్టర్, ఆర్డీఓలకు అర్జీలు ఇచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేసిన పరిస్థితి…

ఈ రోజు ఆ కొండలు ఎక్కడికి పోయాయి…గ్రామస్తులు ఆ కొండలు కనిపించడం లేదని వెతుక్కొంటున్నారు..

ప్రభగిరిపట్నంలో మాయమైన ఆ కొండలను ఓ అనకొండ మింగేసింది…ఆ అనకొండ డలారి గోవర్ధన్ రెడ్డే..

ధాన్యం, ఇసుక, గ్రావెల్ లో దోచుకున్నది చాలక ఇప్పుడు సనాతన ధర్మానికి సంబంధించిన చారిత్రక కొండలను కూడా దోచుకోవడం న్యాయమేనా..

హిందూ దేవాలయాలంటే మీకు మర్యాద లేదా..హిందూ దేవుళ్లపై నమ్మకం లేదా…గోవర్ధన్ రెడ్డీ..

నీకు డబ్బు కావాలంటే ఇంకో వంద పుట్లు వడ్లు ఆడించుకుని సంపాదించుకో కానీ…మా దేవాలయాల జోలికి రావద్దయ్యో….

నా కంఠంలో ఊపిరి ఉండగా ప్రభగిరిపట్నంలో బండ కూడా కదలనీయనని చెబితివి కదా నెల్లూరు బుడ్డారెడ్డా…

అయినా నువ్వు ఇచ్చిన మాట బండను కదలనీయనని మాత్రమే కదా…ఈ రోజు మాయం చేస్తున్నది కొండలను కదా..

స్థానికులు తరతరాలుగా ఆరాధిస్తున్న ఆలయాలను నామరూపాల్లేకుండా చేయడం భావ్యమేనా..

ఈ ఘోరమైన పాపం నిన్ను తప్పకుండా వెంటాడుతుంది గోవర్ధన్ రెడ్డీ..

ఇప్పటికైనా కలెక్టర్, ఎస్పీ స్పందించి అక్రమ మైనింగ్ ఆపండి…లేదంటే చరిత్రలో నిలిచిపోయేలా ఆయనకు డలారి కొండ గోవర్ధన్ రెడ్డి అని పేరు పెట్టండి..

ఒక కొండ పూర్తిగా కనుమరుగైపోయింది…మిగిలిన కొండలపై మైనింగ్ కొనసాగుతోంది..వాటినైనా కాపాడండయ్యా..

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.