అమరావతి (హైకోర్టు)

చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని.. కేసును సీబీఐకి అప్పగించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ వేసిన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరిగింది.

– రాష్ట్రప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.

★ చీరాల దళిత యువకుడి మృతి కేసు దర్యాప్తులో పోలీసులు నిబంధనలు పాటించట్లేదని దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.

★ ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్లు రికార్డు కాకపోవటంతో వాటిని రికార్డులోకి ఎక్కించాలని రిజిస్ట్రీని ఆదేశించింది.

★ తదుపరి విచారణను ఈ నెల17 వ తేదీకి వాయిదా వేసింది.