హైదరాబాద్‌:
దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో సిద్దిపేటలో జరిగిన ఘటనపై భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు హైకోర్టును ఆశ్రయించారు. సిద్దిపేటలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ కొట్టివేయాలంటూ ఆయన క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. తన బంధువుల ఇళ్లలో రూ.18లక్షలు లభించాయంటూ రెవెన్యూ అధికారులు, పోలీసులు కట్టుకథ అల్లారని పిటిషన్‌లో రఘునందన్‌ పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ జస్టిస్‌ లక్ష్మణ్‌ బెంచ్‌ వద్ద విచారణకు రాగా.. ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులను సీజే ధర్మాసనం విచారణ జరపాల్సి ఉంటుందని న్యాయమూర్తి చెప్పారు. ఈ నేపథ్యంలో రఘునందన్‌ క్వాష్‌ పిటిషన్‌ను సీజే ధర్మాసనానికి బదిలీ చేయాలని రిజిస్ట్రీకి న్యాయమూర్తి ఆదేశించారు.