దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11,89,459 కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,774 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనాతో 306 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 4,75,434కి చేరింది. గత 24 గంటల్లో 8,464 మంది కొవిడ్‌ నుండి కోలుకోవడంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి మొత్తం సంఖ్య 3.41 కోట్లు దాటి రికవరీ రేటు 98.36 శాతానికి చేరింది. దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 92,281కి చేరింది. భారత్‌లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ విజృంభిస్తుండడంతో దేశవ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 33కు చేరింది.