మిగిలిన టెలికం కంపెనీల రీఛార్జ్ రేట్లతో పోల్చుకుంటే BSNL మాత్రం చాలా తక్కువ ధరకే తన కస్టమర్లకు బెస్ట్ అఫర్లను ఇస్తోంది. అన్నిటిలోకి బెస్ట్ అఫర్ అంటే, రూ.397 రూపాయల ప్రీపెయిడ్ ప్లాన్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే, ఈ అఫర్ తో BSNL కస్టమర్లకు కేవలం 397 రూపాయలకే పూర్తి 300 రోజుల వ్యాలిడిటీని అఫర్ చేస్తుంది. ఈ అమౌంట్ ని రోజుల లెక్కన లెక్కిస్తే, రోజుకు కేవలం ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతుంది. ఈ ప్లాన్ తో మరిన్ని ఉచిత ప్రయోజనాలు కూడా ఉన్నాయి. BSNL యొక్క 397 రూపాయల ప్రీపెయిడ్ అఫర్ రీఛార్జ్ చేసే వారికీ పూర్తిగా 300 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అంతేకాదు, కస్టమర్లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 2 జిబి డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభిస్తాయి.

కానీ ఈ అన్లిమిటెడ్ కాలింగ్, ఉచిత SMS మరియు డేటా లిమిటెడ్ డేస్ కోసం మాత్రమే. ఈ రీఛార్జ్ చేసే కస్టమర్లకు వ్యాలిడిటీ 365 రోజులు అంటే ఒక సంవత్సరం లభించినా, ఉచిత కాలింగ్, డేటా మరియు SMS సర్వీస్ లు మాత్రం కేవలం 60 రోజులకు మాత్రమే అందుబాటులో ఉంటాయి.