గత తరంలో మోటారు నుండి నీళ్లు బయటకు రావాలంటే మోటార్ ను కొట్టి.. కొట్టి స్టార్టర్‌ను ఆన్ చేయాలి. ఈ మధ్యకాలంలో అయితే సెల్‌ఫోన్ ద్వారా ఎక్కడో ఉండి తమ చేనుకు రైతులు అవసరమైన నీటిని పారించేందుకు మోటారు స్టార్ట్ చూసి ఉంటాం. కానీ, ఒక యువకుడు మాత్రం వినూత్నంగా ఆలోచించి మొబైల్ ద్వారా కాకుండా ఏకంగా చప్పట్లు కొడితే వచ్చే ధ్వని వలన విద్యుత్ మోటార్ స్టార్ట్ అయ్యేలా తన ఆలోచనలకు పదును పెట్టాడు. వివరాలు ఏంటో మీరే చూడండి..

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం ఎలికట్ట గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే యువకుడు కొన్ని రోజుల పాటు ప్రయత్నించి చప్పట్లు కొడితే మోటర్ స్టార్ట్ అయ్యేలాగ, అదే చప్పట్లు కొడితే బంద్ అయ్యేలా స్టార్టర్‌ను తయారుచేసి అమర్చాడు. చెప్పడానికి, చూడడానికి కొంత ఆశ్చర్యంగా అనిపించినా ఆ యువకుడు స్వయంగా దగ్గరుండి మోటార్ ఆన్ చేస్తూ, బంద్ చేస్తున్నాడు. ఇతరులు కొట్టడం ద్వారా కూడా మోటార్ ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. ఈ యువకుడి ఆలోచనను పలువురు అభినందిస్తున్నారు.