హైదరాబాద్ లోని ఐకార్ కు చెందిన సెంట్రల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్(CRIDA )లో కాంట్రాక్ట్ విధానంలో యంగ్ ప్రొఫెషనల్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 17 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. 2021 డిసెంబర్ 22 దరఖాస్తుకు చివరితేదిగా ఉంది. ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. యంగ్‌ ప్రొఫెషనల్‌ 1, యంగ్‌ ప్రొఫెషనల్‌ 2 పోస్టులు వేకన్సీ ఉన్నాయి.

వివిధ విభాగాల్లో క్రాప్‌ ప్రొటెక్షన్, క్రాప్‌ సైన్సెస్, నేచురల్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్, కంప్యూటర్‌ అప్లికేషన్లు, లైవ్‌ స్టాక్, ఐటీ, అడ్మిన్, ఫైన్‌ ఆర్ట్స్, ఫైనాన్స్‌ విభాగాల్లో పోస్టులున్నాయి. విద్యార్హతకు సంబంధించి గ్రాడ్యుయేషన్, బీకాం/బీబీఏ /బీబీఎస్, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్, ఎంసీఏ/ఎమ్మెస్సీ/ఎంటెక్‌ పాసై ఉండాలి. వయోపరిమితికి సంబంధించి 45 ఏళ్లు మించకూడదు. ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.35,000 వరకు చెల్లిస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.icarcrida.res.in/ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.