దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18 లక్షల మందికి పైగా కరోనా పరీక్షలు నిర్వహించగా 2,47,417 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.63 కోట్లకు చేరింది. గత 24 గంటల్లో 84,825 మంది వైరస్‌ నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 47 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 380 మరణాలు సంభవించడంతో ఇప్పటి వరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4.85 లక్షలకు చేరింది. దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 11,17,531కి చేరింది.

దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 5 వేలు దాటాయి. నిన్న కొత్తగా 620 మందిలో ఈ వేరియంట్‌ను గుర్తించడంతో మొత్తం కేసులు 5,488కి చేరాయి. ఇప్పటివరకు 2,162 మంది కోలుకున్నారు.