ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన మంగళగిరిలోని ఆంధ్రప్రదేశ్‌ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 05 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. చార్టర్డ్‌ అకౌంటెంట్‌-01, లీగల్‌అడ్వైజర్‌-01, అసిస్టెంట్‌ మేనేజర్‌ అకౌంటెంట్‌-02, కంపెనీ సెక్రటరీ-01 పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీకామ్, లా బ్యాచిలర్స్‌ డిగ్రీ, సీఏ, ఐసీఎస్‌ఐ నుంచి కంపెనీ సెక్రటరీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం, ఐసీఏఐ సర్టిఫికేషన్‌ ఉండాలి. షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. ఆన్‌లైన్‌ ద్వారా [email protected] ఈమెయిల్‌ కు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది గా 10.01.2022 నిర్ణయించారు. వెబ్‌సైట్‌: https://www.apiic.in/ .