దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం తీవ్ర ఊగిసలాటల మధ్య కొనసాగాయి. సెన్సెక్స్ ఉదయం 61,259 వద్ద మొదలై కాసేపటికే నష్టాల్లోకి జారుకుని ఒక దశలో 61వేల మార్క్‌ను కోల్పోయి 60,949.81 వద్ద కనిష్ఠానికి పడిపోయింది. ఆ తర్వాత కాస్త కోలుకున్నట్లే కన్పించినా మళ్ళీ అమ్మకాల ఒత్తిడికి లోనై నష్టాల్లోకి వెళ్లిన సూచీ చివరకు కాస్త కోలుకుని 85.26 పాయింట్ల లాభంతో 61,235.30 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 18,163 – 18272 పాయింట్ల మధ్య కదలాడి 45.45 పాయింట్ల స్వల్ప లాభంతో 18,257.80 వద్ద ముగిసింది.
ఎన్ఎస్ఈలో సన్‌ఫార్మా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, టాటా స్టీల్, యూపీఎల్ లిమిటెడ్ షేర్లు లాభపడగా.. ఏషియన్ పెయింట్స్, విప్రో, కొటక్ మహీంద్రా బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి.