తెలంగాణలో కరోనా, ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి చర్యలు మొదలు పెట్టింది. కానీ నేడు 13/01/2022 రోజున వేములవాడ రాజన్న సన్నిధిలో ముక్కోటి ఏకాదశి ఉత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో శ్రీ స్వామి వారి పల్లకి సేవ, ఉత్తర ద్వార దర్శనము, శ్రీ స్వామి వారి పెద్దసేవ, ముక్కోటి ఏకాదశి విశిష్టత ప్రవచనం మొదలగునవి కొవిడ్ -19 నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో దేవస్థానం వేద పండితులు, అర్చక స్వాములు, సంబంధిత సిబ్బందితో అంతరంగికముగా నిర్వహించనున్నట్టు తెలిపారు.

కానీ జీవో యంయస్. 01, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తేదీ : 01/01/2022, జీఓ. యంయస్. 06, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, తేదీ : 09/01/2022 లోని ఆదేశాల అనుసారం శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవస్థానము వేములవాడ యందు కొవిడ్ నిబంధనల మేరకు ఈ ఉత్సవాల్లో భక్తులు పాల్గొనేందుకు అవకాశంలేదని ఆలయ అధికారులు ప్రకటించారు.