దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు నేడు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ ను మొదలు పెట్టాయి. ఉదయం 9.30 సమయంలో సెన్సెక్స్‌ 123 పాయింట్లు పెరిగి 61,273 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 35 పాయింట్లు పెరిగి 18,248 వద్ద కొనసాగుతున్నాయి. ట్రైడెంట్‌ లిమిటెడ్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జాగ్రన్‌ ప్రకాశన్‌, ఎంఎస్‌టీఎస్‌, సీక్వెంట్‌ సెక్యూరిటీస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక షీలా ఫామ్‌, సుజ్లాన్‌ ఎనర్జీ, కామిన్‌ ఫిన్‌ సర్వీస్‌, జయప్రకాశ్‌ అసోసియేట్స్‌, విప్రో షేర్లు నష్టాల్లో ఉన్నాయి.