దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ మార్కెట్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన ‘ఈవీలర్స్‌ మొబిలిటీ’ హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల ఫుల్‌ఫిల్‌మెంట్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు ప్రకటించింది. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా, వేగంగా డెలివరీ చేసేందుకు వీలుగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్టు, కస్టమర్లకు ఇంటి వద్దకే ఎలక్ట్రిక్‌ వాహనాలను డెలివరీ చేయాలన్నదే కంపెనీ లక్ష్యం కాబట్టి ఆ దిశగా ఇది కీలక ముందడుగు అని వెల్లడించింది.