జాతీయం (National)

కేంద్రం కొత్త నిర్ణ‌యం… భారీగా పెర‌గ‌నున్న విమాన ఛార్జీలు

కేంద్రం తీసుకున్న కొత్త నిర్ణ‌యంతో దేశంలో డొమెస్టిక్ విమాన ప్రయాణ ఛార్జీలు భారీగా పెర‌గ‌నున్నాయి. డొమెస్టిక్ విమాన ఛార్జీల గ‌రిష్ఠ ఛార్జీలు 30 శాతం ఎక్కువ చేస్తూ కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది. విమానాల్లో ప్ర‌యాణ స‌మ‌యం ఆధారంగా ఛార్జీలు ఉంటాయి. ఇందుకు గానూ ఏడు కేట‌గిరీలు ఉన్నాయి. ఈ అన్ని కేట‌గిరీల్లోనూ విమాన ఛార్జీలు పెర‌గ‌నున్నాయి.

హైదరాబాద్ నుంచి ముంబాయికి ఇప్ప‌టివ‌ర‌కు టిక్కెట్ ధ‌ర రూ.2,500 నుంచి రూ.7,500 ఉండ‌గా ఇప్పుడు రూ.2,800 నుంచి రూ.9,800 వ‌ర‌కు పెర‌గ‌నుంది. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఇప్ప‌టివ‌ర‌కు రూ.4,500 నుంచి 13,00 వర‌కు విమాన ఛార్జీలు ఉండ‌గా ఇప్పుడు రూ.5,000 నుంచి రూ.16,900 వ‌ర‌కు పెర‌గ‌నుంది. మిగ‌తా డొమెస్టిక్ ఛార్జీలు కూడా ప్ర‌యాణ స‌మ‌యం ఆధారంగా 30 శాతం వ‌ర‌కు పెరుగుతాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.