క్రైమ్ (Crime)

ఘ‌ట్‌కేస‌ర్ ఘ‌ట‌న అంతా క‌ట్టు క‌థ‌.. అమ్మాయి ఆడిన డ్రామా

సంచ‌ల‌నం సృష్టించిన ఘ‌ట్‌కేస‌ర్ ఘ‌ట‌న అంతా క‌ట్టుక‌థ అని, అమ్మాయి ఆడిన డ్రామా అని పోలీసులు తేల్చేశారు. అమ్మాయిపైన అత్యాచారం జ‌ర‌గ‌లేద‌ని, అస‌లు కిడ్నాప్ కూడా కాలేద‌ని తేలింది. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేష్ భ‌గ‌వ‌త్ శనివారం మీడియాకు వెల్ల‌డించారు. కండ్ల‌కోయ‌లోని ఓ కాలేజీలో బీఫార్మ‌సీ చ‌దువుతున్న రాంప‌ల్లి ఆర్ఎల్‌న‌గ‌ర్‌కు చెందిన ఓ విద్యార్థిని తాను ఇంటికి వ‌స్తుంటే ఆటో డ్రైవ‌ర్లు కిడ్నాప్ చేశార‌ని త‌ల్లికి ఫోన్ చేసి చెప్పింది.

వెంట‌నే పోలీసులు అమ్మాయి కోసం గాలించ‌గా అప‌స్మార‌క స్థితిలో వివ‌స్త్ర‌గా ఉన్న అమ్మాయిని గుర్తించి ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అమ్మాయి చెప్పిన వివ‌రాల ఆధారంగా మొద‌ట న‌లుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ, అమ్మాయి చెప్పిన స‌మ‌యంలో, లొకేష‌న్‌లో వారు లేర‌ని పోలీసులు గుర్తించారు. దీంతో మ‌రింత లోతుగా విచార‌ణ జ‌రిపి, సీసీ కెమెరాలు ప‌రిశీలించ‌గా అమ్మాయి ఒక బైక్‌పైన వెళ్ల‌డాన్ని గుర్తించారు.

దీంతో అమ్మాయిని అనుమానించిన పోలీసులు గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పడింది. ప్రియుడితో క‌లిసి గంజాయి తీసుకున్న ఆ విద్యార్థిని త‌ల్లి ప‌దేప‌దే ఫోన్ చేస్తుండ‌టంతో కిడ్నాప్ డ్రామా ఆడింది. ఆ త‌ర్వాత త‌న‌ను రేప్ చేశార‌ని, తానే బ‌ట్ట‌లు చింపుకుంది. ఈ మొత్తం వ్య‌వ‌హార‌మంతా అమ్మాయి ఆడిన కట్టుక‌థ అని పోలీసులు గుర్తించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.