రాజకీయం (Politics)

కొడాలి నానిపై నిమ్మ‌గ‌డ్డ సీరియ‌స్‌.. క్రిమిన‌ల్ కేసు న‌మోదు ఆదేశం

మంత్రి కొడాలి నానిపై రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ సీరియ‌స్ అయ్యారు. ఆయ‌న‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని కృష్ణా జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎన్నిక‌ల కోడ్ ఉల్లంఘించార‌ని, ఎన్నిక‌ల కమిష‌న‌ర్‌ను బెదిరించార‌నే ఆరోప‌ణ‌ల‌పై కొడాలి నానిపై కేసులు పెట్టాల‌ని నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ఆదేశించారు.

కాగా, నిన్న మీడియాతో మాట్లాడిన కొడాలి నాని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ఎర్ర‌గ‌డ్డ పిచ్చాసుప‌త్రిలో చికిత్స చేయించుకోవాల‌ని వ్యాఖ్యానించారు. కొడాలి నాని వ్యాఖ్య‌ల‌పై నిన్న‌నే నిమ్మ‌గ‌డ్డ సీరియ‌స్‌గా రియాక్ట్ అయ్యారు. గంట‌లోనే కొడాలి నానికి షోకాజ్ నోటీసు జారీ చేశారు.

నోటీసులు అందిన త‌ర్వాత కూడా కొడాలి నాని వెన‌క‌డుగు వేయ‌లేదు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌పై గౌర‌వం ఉంది అంటూనే త‌న వ్యాఖ్య‌ల‌ను స‌మ‌ర్థించుకున్నారు. ఎర్ర‌గ‌డ్డ‌లో చికిత్స తీసుకోవాల‌ని తాను స‌ల‌హా మాత్ర‌మే ఇచ్చాన‌ని, రాష్ట్ర ప్ర‌జ‌లు అనుకుంటున్న మాట‌నే తాను చెప్పాన‌ని కొడాలి నాని అన్నారు. స‌ల‌హా ఇస్తే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించారు. దీంతో నిమ్మ‌గ‌డ్డ మ‌రింత సీరియ‌స్ అయ్యి కేసు పెట్టాల‌ని ఆదేశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.