అనంతపురం: కూడేరు మండలం శివరాంపేటలో దారుణం చోటు చేసుకుంది. గ్రామ వాలంటీర్ను అర్ధరాత్రి దుండగులు కత్తులతో పొడిచి చంపారు. పొలంలో నిద్రిస్తున్న వాలంటీర్ శ్రీకాంత్ (24)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.