జాతీయం (National) వార్తలు (News)

వాహనాల రిజిస్ట్రేషన్ కొత్త నిబంధనలు

కేంద్ర ప్రభుత్వం వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి కొత్త నిబంధనలు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ ఇప్పటికే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నిబంధన వల్ల ప్రభుత్వానికి చెందిన పాత వెహికల్స్‌ రిజిస్ట్రేషన్ నిలిచిపోనుంది.

15 ఏళ్లకు పైన ఉపయోగిస్తున్న వెహికల్స్ రిజిస్ట్రషన్ ఇక ఉండదు. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన బస్సుల రిజిస్ట్రేషన్ కూడా ఆగిపోతుంది. 15 ఏళ్లు దాటిన వెహిలక్స్ ఇక రోడ్డుపై కనిపించవు.ఇక పాత వెహికల్స్‌ను సీఎన్‌జీ రూపంలోకి మార్చుకుంటే ప్రస్తుతం తిరిగేందుకు అనుమతులు లభిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రూల్‌కు సంబంధించి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తుంది. 30 రోజుల వరకు ప్రజలు, పరిశ్రమ సంబంధిత వర్గాలు ప్రభుత్వపు కొత్త రూల్‌పై వారి సలహాలు, సూచనలు అందించిన తర్వాత మోదీ ప్రభుత్వం ఈ కొత్త రూల్స్‌ను అమలులోకి తీసుకువస్తుంది.

ప్రభుత్వాలకు చెందిన అన్ని వెహికల్స్‌కు కూడా ఈ 15 ఏళ్ల నిబంధన వర్తిస్తుంది. 15 ఏళ్లు దాటిన తర్వాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యూవల్ ఉండదని స్పష్టం చేసింది. 2022 ఏప్రిల్ 1 నుంచి ఈ రూల్ అమలులోకి వస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.