దక్షిణ మధ్య రేల్వే నుంచి ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది. కరోనా కేసులు పెరిగిపోతున్నాయి అంటూ కరోనా రూల్స్ పేరుతో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర అదనంగా రూ.20 పెంచి ఇలా పెంచడం వల్ల ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికుల రద్దీ తగ్గుతుంది అని రైల్వే శాఖ వ్యాఖ్యానిస్తుంది. ఇప్పుడు ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.30 నుంచి రూ.50 చేశారు. ఈ విషయాన్ని నిర్ధారిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) జనరల్ మేనేజర్ ప్రత్యేక ప్రకటన చేసారు. గతేడాది కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ అవి అమల్లోకి వచ్చాయి. రూ.50 అంటే చాలా కష్టం అంటూ ప్రజలు వాపోతున్నారు. ఈ ఛార్జీల భారం పడకుండా ఉండాలంటే రైలు ఎక్కేవారు మాత్రమే స్టేషన్‌లోకి వెళ్లి మిగతావారు బయటి నుంచే సెండాఫ్ చెప్పడం మేలని కొందరు ప్రయాణికులు అంటున్నారు. ఈ పెరిగిన ఛార్జీలు ఇవాళ్టి నుంచి అమల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రూ.50 వసూలు చేస్తున్నారు.