సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నుంచి సత్తుపల్లి మీదుగా కాకినాడ పోర్టుకు లారీలో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఈ లారీని ఎస్సై నరేశ్, సిబ్బంది పట్టుకున్నారు. ఈ లారీ లో 20 టన్నుల రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్టు సత్తుపల్లి పోలీసులు వివరించారు. లారీతోపాటు డ్రైవర్ అన్నాబత్తుల గణపతిరావు, క్లీనర్ కొర్ల సత్తిబాబును అదుపులోకి తీసుకుని స్థానిక ఠాణాకు తరలించారు. బియ్యాన్ని పౌరసరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. ఆర్ఐ మధుసూధన్‌రావు మాట్లాడుతూ ఇందులో కొన్ని నూకలూ ఉన్నాయని, నమూనాలనూ సేకరించామని, హుజూర్‌నగర్‌లోని రెండు మిల్లుల్లో లోడింగ్ చేసి తరలిస్తున్నట్లుగా ప్రాథమిక సమాచారం.