అంతర్జాతీయం (International) వార్తలు (News)

గూగుల్‌కు భారీ జరిమానా విధించిన యాంటీట్రస్ట్‌ ఏజెన్సీ??

ఫ్రాన్స్‌కు చెందిన యాంటీట్రస్ట్‌ ఏజెన్సీ గూగుల్‌కు భారీ జరిమానా విధించింది. వార్తల ప్రచురణ విషయంలో స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆదేశాలు ఉల్లంఘించిన నేపథ్యంలో 500 మిలియన్‌ యూరోల ఫైన్‌ అంటే భారత కరెన్సీలో రూ.4,415 కోట్లు జరిమానా చెల్లించాలిసిందిగా పేర్కొంది.

తమ వార్తల్ని ‘గూగుల్‌ న్యూస్‌’లో ప్రచురించి ప్రకటనల రూపంలో అల్ఫాబెట్‌ భారీ స్థాయిలో ఆదాయం పొందుతోందన్న విషయంలో వార్తా సంస్థలు, గూగుల్‌ మధ్య చాలా కాలంగా పోరు నడుస్తోన్న నేపథ్యంలో ప్రకటనల ఆదాయంలో తమకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియా సహా ఐరోపా దేశాల ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాల్సి తీసుకొచ్చాయి. వివిధ మీడియా సంస్థలకు చెందిన వార్తల్ని ప్రచురించడానికి ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశాయి. ఈ మేరకు గూగుల్‌కు కొంత సమయం ఇచ్చాయి.

ఫ్రాన్స్‌ యాంటీ ట్రస్ట్‌ ఏజెన్సీ సైతం స్థానిక వార్తా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని గూగుల్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఫ్రాన్స్‌ ప్రభుత్వ చట్టాల్ని, నిబంధనల్ని అమలు చేయడంలో గూగుల్‌ జాప్యం చేసిందని తద్వారా కాపీరైట్‌ ఉల్లంఘనలకు పాల్పడిందని ఆరోపిస్తూ ఈ విషయంలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో భారీ జరిమానా విధించాలని నిర్ణయించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •