వార్తలు (News)

అల్లుడికి కట్నం.. 21 విషసర్పాలు..??

మధ్యప్రదేశ్‌లోని గొరియా తెగ వారు పెండ్లిలో కట్నంగా నగదుకు బదులుగా బతికున్న విషసర్పాలను వరుడికి కట్నంగా అందిస్తారు. ఇటీవల జరిగిన ఓ పెండ్లిలో వధువు తండ్రి వరుడికి 21 పాములను కట్నంగా ఇవ్వడంతో మరోసారి ఈ అంశం చర్చలోకి వచ్చింది. అయితే పెండ్లి యొక్క పవిత్రతను కాపాడేందుకు పాములు సహకరిస్తాయనేది గొరియా తెగ ప్రజల నమ్మకం. అంతేకాదు వాళ్ల ముఖ్య వృత్తి కూడా పాములను పట్టుకోవడమే.. కాబట్టి వారికి పాములంటే భయం ఉండదు. ముఖ్యంగా ఆ తెగలో యువతికి పెండ్లి అంటే చాలు.. ఆ కుటుంబమంతా పాములను పట్టే పనిలో బిజీ అయి సాధ్యమైనన్ని పాములను పట్టుకుని అల్లుడికి కట్నంగా ఇస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •