వార్తలు (News)

ఈ నెల 21న ఈదుల్‌ అజ్హా పర్వదినం!!

బలిదానానికి ప్రతీకగా నిలిచే ఈదుల్‌ అజ్హా కోసం ముస్లింలు సమాయత్తమవుతున్నారు. హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌హజ్జ మాసంలో 10న జరిగే పండగకు ఎంతో చరిత్ర ఉందని ముస్లింల ప్రగాఢ నమ్మకం! ఆదివారం జిల్‌హజ్జ నెలవంక కనిపించడంతో సోమవారం మాసపు మొదటి తేదీ కావడంతో ఈ నెల 21న బక్రీద్‌ పండగ జరుపుకుంటారు. ఈ నెల 19 నుంచి సౌదీ అరేబియాలోని మక్కాలో హజ్‌ కార్యక్రమం కూడా ప్రారంభమై రెండు రోజుల పాటు సాగుతుంది. ముస్లింలందరూ బక్రీద్‌ పండగ రోజుతో పాటు ఆ తర్వాత మూడు రోజుల వరకు (వీలును బట్టి) ఖుర్బానీ ఇస్తుంటారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    39
    Shares
  • 39
  •  
  •  
  •  
  •