వార్తలు (News)

ఏపీలో నిబంధనలు ఉల్లంఘించే షాపులకు భారీ జరిమానాలు!!

ఏపీలో కరోనా పరిస్థితులపై సోమవారం అధికారులతో ఏపీ సీఎం జగన్ సమీక్షించి ర్ఫ్యూ సమయం సడలింపుపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే విధంగా కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేస్తూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇవ్వాలని ఆదేశించారు. రాత్రి 9 గంటలకు రాష్ట్రంలోని అన్ని షాపులను మూసివేయాలన్నారు. కరోనా నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని, మాస్కు లేకపోతే రూ.100 జరిమానా వేయాలన్నారు. దుకాణాలలో సిబ్బంది, కొనుగోలుదారులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే షాపులకు భారీ జరిమానాలు విధించాలని స్పష్టం చేసారు. ఏపీ వ్యాప్తంగా 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని.. ప్రజలెవరూ గుమిగూడకుండా చూడాలని సీఎం జగన్ ఆదేశించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •