వార్తలు (News)

రాజస్థాన్‌లో, ఉత్తర ప్రదేశ్ లలో వర్షంతో పాటు పిడుగులు .. !!

రాజస్థాన్‌లోని జైపుర్‌లో ఆదివారం పిడుగుపాటుకు 11 మంది మరణించగా మరికొందరు గాయపడ్డారు. 12శతాబ్దంనాటి అమేర్ కోటకు చెందిన క్లాక్‌టవర్‌పైకి ఎక్కి 27 మంది సెల్ఫీలు తీసుకుంటుండగా పిడుగులు పడడంతో వీరిలో కొందరు భయంతో పైనుంచి కిందకు దూకేసారు. ఈ కోటకు పర్యటకులు ఎక్కువగా వస్తుంటారు. ప్రస్తుతం మరణించిన వారిలో చాలా మంది యువతే ఉన్నారు. ఒక్క ఆదివారంనాడే రాజస్థాన్‌లో వేర్వేరుచోట్ల పిడుగుపాటుకు మరో తొమ్మిది మంది మృతి చెందగా మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు.

మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోనూ పిడుగుపాటుకు 28 మంది మరణించారు. ఒక్క ప్రయాగ్‌రాజ్‌లోనే 13 మంది చనిపోగా చాలా మందికి గాయాలయ్యాయి. మరోవైపు డజన్లకొద్దీ పశువులు కూడా పిడిగుపాటు వల్ల మరణించినట్లు తెలుస్తుంది. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •