క్రైమ్ (Crime) వార్తలు (News)

మైక్రో ఫైనాన్స్‌ పేరుతో మోసం.. బ్యాంకుల వద్ద భారీ రుణాలు??

మైక్రో ఫైనాన్స్‌ సంస్థ నిర్వహణ పేరుతో రుణాలు పొంది, బ్యాంకులను మోసం చేస్తున్న ఒడిశాకు చెందిన ఫిన్‌సర్వ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ సీఈఓ, ఎండీగా దీపక్‌ కిండో ను సీసీఎస్‌ పోలీసులు సోమవారం అరెస్ట్‌ చేశారు. ఆయన పదవీ కాలంలో దేశ వ్యాప్తంగా బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ నుంచి రూ. 200 కోట్ల రుణాలు పొంది, వాటిని తిరిగి చెల్లించకుండా చేతులెత్తేశాడు.

హైదరాబాద్‌కు చెందిన నాబార్డుకు అనుబంధంగా కొనసాగుతున్న నబ్‌ సంవృద్ధి ఫైనాన్స్‌ లిమిటెడ్‌ నుంచి ఒడిశాలో మైక్రో ఫైనాన్స్‌ చేస్తానంటూ 2019 మార్చి నెలలో రూ. 5 కోట్ల రుణం తీసుకున్నాడు. వాయిదాల పద్ధతిలో రూ. 3 కోట్లు మాత్రమే చెల్లించి, మిగతా రుణం చెల్లించకుండా చేతులెత్తేయడంతో రుణం ఇచ్చిన సంస్థ చీఫ్‌ ఫైనాన్షియల్‌ అఫీసర్‌ గతనెలలో సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఒడిశాలోని రాజ్‌గంగ్‌పూర్‌లో నిందితుడు దీపక్‌ కిండోను అరెస్ట్‌ చేసి, నగరానికి తరలించారు. పలు రాష్ట్రాల్లో సైతం అతడిపై కేసులు నమోదయ్యాయని జాయింట్‌ సీపీ అవినాశ్‌ మహంతి వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •