వార్తలు (News)

దివిసీమలో 100 అడుగులు ముందుకొచ్చిన సముద్రం!!

కృష్ణాజిల్లా కోడూరు మండలంలో హంసలదీవి సాగర తీరం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారి 100 అడుగులు సముద్రం ముందుకు రావడంతో దివిసీమ ప్రాంతవాసులు భయాందోళనకు గురౌతున్నారు. అలల ఉధృతితో పర్యావరణ విజ్ఞాన కేంద్రం బీచ్‌ దగ్గర నుంచి కష్ణానది సముద్రంలో విలీనమయ్యే ప్రదేశమైన సాగర సంగమం వరకూ సుమారు మూడు కిలోమీటర్ల మేర మూడు అడుగుల ఎత్తు ఉన్న ఇసుక తిన్నెలు కోతకు గురై సాగర సంగమం వద్ద పర్యాటకులను హెచ్చరిస్తూ ఏర్పాటుచేసిన బారికేడ్లు అలల్లో కలిసిపోయాయి. సముద్రపు అలలు ముందుకొచ్చి బీచ్‌ రహదారిని బలంగా తాకుతున్నాయి. రహదారి కోతకు గురైంది.

కష్ణమ్మ పాదాలు విగ్రహం ఏర్పాటు చేసిన ప్లాట్‌ ఫామ్‌ కూడా ధ్వంసమైంది. స్థానిక మత్స్యకారులు వేటకి వెళ్లొద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీచేసింది. మళ్లీ సాధారణ పరిస్థితులు వచ్చే వరకు హంసలదీవి బీచ్‌ వద్ద ఎంట్రన్స్‌ గేట్లు మూసివేసి ఉంటాయని పేర్కొన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    447
    Shares
  • 447
  •  
  •  
  •  
  •