క్రైమ్ (Crime) జాతీయం (National) వార్తలు (News)

ఆగష్టు 15 ముందు భారీ కుట్రను భగ్నం చేసిన ఢిల్లీ పోలీసులు!!

ఆగష్టు 15 సందర్భంగా వేడుకలు నిర్వహించుకునే సమయంలో దేశ రాజధానిలో ఉగ్ర దాడులు, హింసాత్మక ఘటనలు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో దిల్లీ పోలీసులు అప్రమత్తమై విస్తృత తనిఖీలు చేపట్టి భారీ కుట్రను భగ్నం చేసి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 55 పిస్టోళ్లు, 50 లైవ్‌ బులెట్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వ్యక్తుల్లో ఒకరు దిల్లీ వాసి కాగా మిగతా వారు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందినవారిగా తెలుస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యా అరెస్ట్ అయిన వ్యక్తుల సమాచారం గోప్యంగా ఉంచారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ లోని పలు ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా సరిహద్దుల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్లు, బెలూన్లు వంటివి ఎగరవేయడంపై నిషేధం విధించారు. ఎర్రకోట సహా పలు ప్రముఖ ప్రాంతాల్లో భద్రతను పెంచారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •