ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

టీచర్లకు వ్యాక్సినేషన్ పూర్తికాకుండా స్కూల్స్ ప్రారంభిస్తే ఎలా??

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 16వ తేదీ నుంచి పాఠశాలల తలుపులు తెరుచుకోనున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసిన తరుణంలో కరోనా మహమ్మారి భయం ఇంకా తొలగిపోలేదు. ఈ పరిస్థితుల్లో స్కూళ్లను రీ ఓపెన్ చేయడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.

రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయులందరికి ఇప్పటివరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లను ఎలా తెరుస్తారని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రశ్నించిన దానికి ప్రభుత్వంతరపు న్యాయవాది 85 శాతం వ్యాక్సినేషన్‌ను పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు. అయితే ఈ పిటిషన్‌కు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని కోరారు. దీంతో హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 18కి వాయిదా వేసింది.

మరోవైపు స్కూళ్లను తెరవాలని కొందరు వాదిస్తూ రాజకీయ నాయకుల భారీ సభలు, సమావేశాలు, షాపులు, రెస్టారెంట్లు, వాహన రాకపోకలు అన్నీ జరుగుతున్నప్పుడు… స్కూళ్లకు మాత్రం అభ్యంతరం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్కూళ్లను తెరిస్తే విద్యార్థుల ఆరోగ్యాలకు రక్షణ ఎక్కడుంటుందని మరికొందరు భావిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •