అంతర్జాతీయం (International) జాతీయం (National) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

రెండో రోజు తొలి సెషన్‌ ముగిసే సమయానికి వికెట్లు కోల్పోయిన భారత్!!

టీమ్ఇండియా రెండో రోజు తొలి సెషన్‌ పూర్తి అయింది. 276/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శుక్రవారం ఆట కొనసాగించిన భారత్‌ మరో నాలుగు వికెట్లు కోల్పోయి భోజన విరామ సమయానికి 346/7 స్కోర్‌తో నిలువగా జడేజా(31), ఇషాంత్‌ శర్మ(0) నాటౌట్‌గా నిలిచారు.

దానికి మునుపు కేఎల్‌ రాహుల్‌ (129), అజింక్య రహానె(1) ఆట ప్రారంభించగా తొలి రెండు ఓవర్లలోనే ఔటయ్యారు. రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో రాహుల్‌ సిబ్లీ చేతికి చిక్కగా, తర్వాతి ఓవర్‌లోనే అండర్సన్‌ బౌలింగ్‌లో రహానె, రూట్‌ చేతికి చిక్కాడు. దాంతో భారత్‌ 282 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయి అనంతరం రిషభ్‌ పంత్‌(37), జడేజా నిలకడగా ఆడి ఆరో వికెట్‌కు 49 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ దురదృష్టవశాత్తు పంత్‌ అనుకోకుండా మార్క్‌వుడ్‌ బౌలింగ్‌లో కీపర్‌కు చిక్కడంతో భారత్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది.

తరువాతి ఓవర్‌లోనే షమి(0) సైతం మోయిన్‌ అలీ బౌలింగ్‌లో పెవిలియన్‌ చేరగా ఇదే క్రమంలోనే జోడీ కట్టిన జడేజా, ఇషాంత్‌ మరో వికెట్‌ పడకుండా తొలి సెషన్‌ను పూర్తి చేశారు. ఇప్పటివరకు ఇంగ్లాండ్‌ బౌలర్లలో అండర్సన్‌ మూడు వికెట్లు తీయగా రాబిన్‌సన్‌ రెండు, మార్క్‌వుడ్‌, మోయిన్‌ అలీ చెరో వికెట్‌ తీశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •