అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

చైనాలో ఇకపై కారియోకీ పాటలు నిషేధం!!

సంగీత ప్రపంచంలో కారియోకీ పాటలను బార్స్‌లో ప్రదర్శిస్తుంటారు. అయితే చైనా సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ కారియోకీ పాటలను చట్టవిరుద్ధంగా భావించి వాటిని నిషేధించింది. అక్టోబర్‌ 1 నుంచి వీటిని ప్రదర్శించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. చైనాలో వినోదాన్ని పంచే కారియోకీ అవుట్లెట్లు సుమారు 50వేలు ఉంటే ఇందులో లక్షకుపైగా పాటలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న ఆదేశాల మేరకు ఇవన్నీ మూతబడనున్నాయి. సాధారణంగా కారియోకీ ప్రదేశాల్లో ప్రదర్శించే పాటలకు అక్కడ పనిచేసే కంటెంట్‌ ప్రొవైడర్స్‌ బాధ్యత వహిస్తారు. ఇకపై ఈ పాటల స్థానంలో ఆరోగ్యకరమైన పాటలను ప్రదర్శించాలని ఆదేశాలు జారీ చేసింది.

చైనా జాతీయ ఐక్యత, సార్వభౌమత్వానికి హాని కల్పించేలా ఈ కారియోకీ పాటలు ఉన్నాయని, మతపరమైన విధానాలను ఉల్లంఘించడం, జూదం మాదకద్రవ్యాల వంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ప్రోత్సహించేలా ఉన్న కారణంగా వీటిని బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది ఈ డ్రాగన్‌ దేశం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •