క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

ఓటుకు నోటు కేసు..సెప్టెంబర్ 6కి వాయిదా!!

ఓటుకు నోటు కేసులో నిందితుడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇవాళ అనిశా ప్రత్యేక న్యాయస్థానానికి హాజరయ్యారు. రేవంత్‌తో పాటు నిందితులు సెబాస్టియన్‌, ఉదయ్‌ సింహా విచారణకు హాజరవ్వగా ఈ కేసులో సాక్షిగా ఉన్న అసెంబ్లీ మాజీ కార్యదర్శి సదా రాజారాం వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసింది. సదా రాజారాం ఎమ్మెల్సీ ఎన్నిక రిటర్నింగ్‌ అధికారిగా వ్యవహరించడంతో రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ ప్రసంగాల రికార్డులను అనిశాకు సమర్పించారు. పంచనామా సాక్షిగా ఉన్న ప్రధానోపాధ్యాయుడు రాజ్‌కుమార్‌ క్రాస్‌ ఎగ్జామిన్‌ పూర్తయింది. సెప్టెంబరు 6కి తదుపరి విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •