అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

జపాన్ లో రెండుగా విరిగిన నౌక.. సముద్రపు నీటిలో ఆయిల్ తట్టు!!

జపాన్‌ సముద్ర తీరంలో బుధవారం పనామా దేశానికి చెందిన కార్గో షిప్‌ క్రిమ్సన్ పొలారిస్, జపాన్‌ అమోరిలోని హచినోహె పోర్ట్ చుట్టూ తిరుగుతుండగా రెండు ముక్కలుగా విరిగిపోయింది. విరిగిన ఒక భాగం పైకి లేవగా విరిగిన మరో భాగం సముద్రంలో మునుగుతున్నది. రవాణా ఓడలోని చైనా, ఫిలిపిన్స్‌కు చెందిన 21 మంది సిబ్బందిని జపాన్‌ కోస్ట్‌ గార్డ్ రక్షించింది. దీని కోసం మూడు పెట్రోలింగ్‌ బోటులు, మూడు విమానాలను వినియోగించినట్టు సమాచారం! విరిగిన కార్గో షిప్‌ నుంచి ఆయిల్‌ భారీగా లీక్‌ అవుతున్నది. సుమారు 24 కిలోమీటర్ల పరిధిలో ఆయిల్‌ నీటిపై తట్టులా విస్తరించిందని జపాన్ అధికారులు తెలిపారు. ఆయిల్‌ లీకేజీని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •