అంతర్జాతీయం (International) క్రైమ్ (Crime) వార్తలు (News)

బ్రిటన్‌లో దుండగుడి కాల్పుల్లో ఆరుగురు మృతి!!

బ్రిటన్‌లోని ప్లైమౌత్‌లో గురువారం కాల్పులు చోటు చేసుకున్నాయని వీటిలో ఆరుగురు మరణించారని పోలీసులు తెలిపారు. ‘‘మరణించిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి కూడా మృతి చెందాడు. వీరంతా బుల్లెట్ గాయాల వల్లే మరణించారు. మృతుల కుటుంబ సభ్యులకు ఈ వివరాలు తెలియజేశారు.

మరణించిన వారిలో ఒకరి వయసు పదేళ్లలోపే ఉందని, మరికొంత మంతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, ‘‘మొదట ఓ ఇంటి తలుపుకొట్టిన సాయుధుడు, బయటకు వచ్చిన వారిపైకి కాల్పులు జరిపాడు. ఆ తర్వాత పరిసరాల్లోని పార్క్ దగ్గర మరికొంత మందిపై అతడు కాల్పులు జరిపాడు’’ అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    78
    Shares
  • 78
  •  
  •  
  •  
  •