వార్తలు (News)

వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల స్వరూపం..పేర్లు మార్చిన తెలంగాణ సర్కార్!!

తెలంగాణ ప్రభుత్వం వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాల పేర్లు మార్చుతూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా పేరును వరంగల్‌ జిల్లాగా పేర్లు మారుస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం భౌగోళిక మార్పులతో జిల్లాల పేర్లు మారుస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది.

13 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 2027.89 చ.కిమీ వైశాల్యం, 9,63,975 మంది జనాభాతో వరంగల్ జిల్లాను ఏర్పాటు చేశారు. 14మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లు, 1466.23 చ.కిమీ వైశాల్యం, 8,35,420 మంది జనాభాతో హన్మకొండ జిల్లా ఏర్పాటు చేశారు.

వరంగల్ అర్బన్, గ్రామీణ జిల్లాలనగానే రెండు జిల్లాల ప్రజలూ తరచూ కన్ఫ్యూజన్‌కు గురయ్యారు. ఏది ఏమిటో తెలియక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చదువురాని వారే కాదు చదువుకున్న వాళ్లు సైతం పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కున్నారు. దీంతో పేర్లను మార్చాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది. అదే క్రమంలో హన్మకొండ పేరు ప్రాచుర్యం లేదన్న భావన అందరిలో ఉంది. పంచాయత్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఇదే విషయాన్ని పలుమార్లు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. తాజాగా పేర్లు మార్పుతో ఇరు జిల్లాల ప్రజలు ఆనందంగా ఉన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •