ఎన్నికలు (Elections) రాజకీయం (Politics) వార్తలు (News)

గుజరాత్‌ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ నియామకం!!

కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికైనట్టు కేంద్ర పరిశీలకులుగా విచ్చేసిన నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో ఆదివారం సమావేశమైన శాసనసభాపక్షం వెల్లడించింది. ఘట్లోడియా నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న భూపేంద్ర పటేల్‌ ను బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా పటేల్‌ను ఎన్నుకుంది.

పటేల్‌ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలనే నిర్ణయంతో ముఖ్యమంత్రిగా భూపేంద్ర పేరును ఖరారు చేశారు. విజయ్‌ రూపానీ శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈ మేరకు బీజేపీ వ్యూహం రచిస్తుండడంలో భాగంగా ఆ రాష్ట్రంలో పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. పాటిదార్ సామాజిక వర్గానికే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు దక్కాయి. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ కొనసాగనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •