అంతర్జాతీయం (International) వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ గెలుచుకున్న ఎమ్మా రదుకాను!!

యూఎస్‌ ఓపెన్‌ మహిళల టెన్నిస్‌ సింగిల్స్‌లో 18 ఏళ్ల బ్రిటిష్‌ యువకెరటం ఎమ్మా రదుకాను చరిత్ర సృష్టించింది. మహిళల సింగిల్స్‌ టైటిల్‌ పోరులో కెనాడాకు చెందిన 19 ఏళ్ల లెలా ఫెర్నాండెజ్‌ను 6-4, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను గెలుచుకుంది. దీంతో యూఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్న తొలి క్వాలిఫైయర్‌గా రదుకాను చరిత్ర తిరగరాసింది. 150 ర్యాంక్‌లో కొనసాగుతున్న ఎమ్మా బ్రిటన్‌ తరఫున 1977లో వర్జీనియా వేడ్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ గెలుపొందింది.

ఇక టైటిల్‌ గెలిచిన ఎమ్మా 2.5 మిలయన్‌ డాలర్ల ప్రైజ్‌ మనీని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో ఒక్కసారిగా ఆమె ర్యాంకు 150 నుంచి 23కు చేరుకుని బ్రిటన్‌లో నంబర్‌ వన్‌ క్రీడాకారిణిగా పేరు తెచ్చుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •