జాతీయం (National) వార్తలు (News)

అక్టోబర్‌ నుంచి పెరగనున్న గ్యాస్ ధరలు!!

అక్టోబర్ నుంచి వంట గ్యాస్‌ (పీఎన్‌జీ) , సీఎన్‌జీ ధరలు 10-11 శాతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేచురల్‌ గ్యాస్ ధరలు 76 శాతం పెరగడంతో వీటి ధరలు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఓఎన్‌జీసీ వంటి కంపెనీలు సేకరించిన నేచురల్ గ్యాస్ ధరలను ప్రభుత్వం ప్రతీ 6 నెలలకు ఒకసారి రివ్యూ చేస్తోంది. డీఐలో భాగంగా రాబోయే రివ్యూ అక్టోబర్ 1 న ఉంది. అడ్మినిస్ట్రేటెడ్​ సింగ్‌ మెకానిజం (ఏపీఎం) ప్రకారం నేచురల్ గ్యాస్ ధర ఒక మిలియన్ బ్రిటిష్‌ థర్మల్ యూనిట్‌ (ఎంఎంబీటీయూ) కి 3.15 డాలర్ల చొప్పున పెంచుతారని అంచనా వేశారు.

ప్రస్తుతం ఈ రేటు 1.79 డాలర్లు. రాబోయే రివ్యూ మీటింగ్‌లో పెంచిన రేట్లు 2022, మార్చి 31 వరకు అమల్లో ఉంటాయి. కాగా, సీఎన్‌జీ, పీఎన్‌జీని నేచురల్ గ్యాస్‌ నుంచి సేకరిస్తారు. సీఎన్‌జీని ఆటోమొబైల్స్‌లో కూడా వాడుతున్న సంగతి తెలిసిందే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •