జాతీయం (National) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

రైలు బోగీలు కొనుక్కోవచ్చు.. లీజుకు తీసుకోవచ్చు: రైల్వే శాఖ ప్రకటన!!

ఇండియన్ రైల్వే పర్యాటకరంగాన్ని విస్తరిస్తూ రైల్వే ఆదాయాన్ని పెంచుకొనేలా కొత్త కొత్త ప్రణాళికలు రూపొందించడంలో భాగంగా నూతనంగా రైలు బోగీల లీజుకిచ్చే వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. రైలు బోగీలను లీజుకు తీసుకొని వాటిని సాంస్కృతిక, మతపరమైన పర్యాటకానికి వినియోగించుకోవచ్చని సూచిస్తోంది. మార్కెటింగ్, ఆతిథ్యం, ​​సేవల అనుసంధానం, కస్టమర్ బేస్‌తో చేరుకోవడమే లక్ష్యంగా మంత్రిత్వ శాఖ కృషిచేస్తోందని ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే కొన్ని రైళ్లను లీజుకు ఇచ్చే ప్రక్రియ మొదలు పెట్టిన రైల్వే శాఖ కొత్తగా బోగీల లీజు ప్రారంభించింది.

రైలు బోగీ లీజు ప్రతిపాదనలు మీరు కూడా తెలుసుకోండి..
ఆసక్తిగ వారు ఎవరైన రైలు బోగీలను లీజుకు తీసుకోవచ్చు. లీజుకు తీసుకొన్న బోగీలను లీజుకు తీసుకొన్న వ్యక్తి ఇష్టమైన ఆకృతిలో తీర్చిదిద్దొచ్చు. కనీసం లీజు పరిమితి 5 సంవత్సరాలు గా నిర్ణయించారు. కోచ్ లీజును జీవితంకాలం పొడిగించుకోవచ్చు. రూట్లు, టారిఫ్ నిర్ణయాధికారం అద్దెకు తీసుకొనే వారికే ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది.
ఈ బోగీనలు సాంస్కృతిక, మతపరమైన ఇతర పర్యటక సర్క్యూట్ రైళ్లుగా ఉపయోగించుకోవచ్చు. నూతన యాత్రికులను ఆకర్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇండియాలో నాణ్యమైన టూరిజానికి ఇది కొతత్బాటలు వేస్తుందని రైల్వే అధికారులు అభిప్రాయ పడుతున్నారు.
టూరిజం(Tourism)కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానానికి రైల్వే శ్రీకారం చుట్టింది.నడపొచ్చని రైల్వే శాఖ అభిప్రాయపడింది.

ఇప్పటి వరకు టూరిజం అభివృద్ధికి రైల్వే ప్రకటించిన స్కీమ్‌లు : ఇప్పటికే పలు వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తూ టూరిజం డెవలప్‌మెంట్ కోసం రైల్వే కృషి చేస్తోంది. కదిలే రైలులోనే బర్త్‌డే పార్టీ సెలబ్రేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఐఆర్‌సీటీసీ కొద్ది రోజుల క్రితం తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది.
స్మార్ట్ కార్డులున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్‌లైన్‌లో స్మార్ట్ కార్డులను రీచార్జ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు అవకాశం కల్పిస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. స్మార్ట్ కార్డులు కలిగి ఉన్న ప్రయాణికులు ‘UT Sonmobile’వెబ్ పోర్టల్‌లో నమోదు చేయడం ద్వారా వారి కార్డులను ఆన్‌లైన్‌లో రీ-ఛార్జ్ చేసుకోవచ్చు. తద్వారా రిజర్వ్ చేయని టిక్కెట్లు, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్ల కొనుగోలు చేసుకోవచ్చు.

IRCTC యొక్క కొత్త టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఆగస్టు 29 నుంచి ‘భారత్ దర్శన్ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్’ ను నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు దేశంలోని అనేక ప్రదేశాలకు తీసుకెళ్లబడతారు. ఇందుకోసం మీరు కేవలం రూ .11,340 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. జ్యోతిర్లింగ్‌తో పాటు, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దర్శనాన్ని కూడా ఈ ప్యాకేజీ అందిస్తోంది. ఈ రైలు హైదరాబాద్ – అహ్మదాబాద్ – నిష్క్లాంక్ మహాదేవ్ శివాలయం – అమృత్‌సర్-జైపూర్ మరియు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి ప్రదేశాలను కవర్ చేస్తున్నట్టు వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •