జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

సోమవారం నుంచి ఆఫీస్ కు వెళ్లనున్న విప్రో ఉద్యోగులు!!

కొవిడ్‌ ఉద్ధృతి తగ్గుముఖం పట్టడం, మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా సాగుతుండటంతో కొన్ని ప్రముఖ ఐటీ సంస్థలు తమ ఉద్యోగులను కార్యాలయాలకు పిలిచే పనిలో పడిందనడానికి సంకేతంగా ప్రముఖ సంస్థ ‘విప్రో’.. తన ఉద్యోగులను సోమవారం నుంచి కార్యాలయాలకు రావాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే రెండు డోసులు పూర్తయినవారిని మాత్రమే విధులకు అనుమతించనుంది. హైబ్రిడ్‌ మోడల్‌ వర్క్‌ విధానంలో ప్రస్తుతానికి వారానికి రెండు రోజులు ఆఫీస్‌ నుంచి పని చేయాలని సూచిస్తూ సంస్థ ఛైర్మన్‌ రిషద్‌ ప్రేమ్‌జీ ఆదివారం ఓ ట్వీట్‌ చేశారు. ‘18 నెలల అనంతరం.. మా ఉద్యోగులు సోమవారం నుంచి వారానికి రెండు రోజులపాటు ఆఫీస్‌కు రానున్నారు. రెండు డోసుల టీకా పూర్తయినవారు, సురక్షితంగా వచ్చి వెళ్లేలా, వ్యక్తిగత దూరం పాటించేలా ఏర్పాట్లు చేశాం. ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలిస్తాం’ అని పేర్కొన్నారు. కార్యాలయాల ప్రాంగణంలో పాటించాల్సిన నిబంధనలు, కొవిడ్‌ సేఫ్టీ ప్రొటోకాల్స్‌పై ఒక వీడియో ను కూడా రూపొందించారు.

విప్రో ఉద్యోగుల్లో రెండు లక్షల మంది ఉద్యోగులు ఉండగా జులైనాటికి దాదాపు 55 శాతం మంది వ్యాక్సిన్‌ వేయించుకున్నట్టు సమాచారం! మూడో వేవ్‌ పొంచి ఉందనే వార్తల నేపథ్యంలో కొన్ని సంస్థలు వేచి చూద్దామనే ధోరణిలో ఉండగా మరికొన్ని హైబ్రిడ్‌ మోడల్‌ వర్క్‌ విధానాన్ని అవలంబిస్తున్నాయి. ఈ విధానంలో ఉద్యోగులు అవసరమైనప్పుడు ఆఫీస్‌ నుంచి లేదా ఇంటినుంచి పని చేసుకోవచ్చు. ఈ విధానంతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, మరింత ఉద్యోగ కల్పనకు అవకాశం దక్కుతుందని పారిశ్రామిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •