క్రైమ్ (Crime) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

‘నీట్‌’ పరీక్ష పై భయంతో యువకుని ఆత్మహత్య!!

వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ‘నీట్‌’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష) పై విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొనడంతో కొందరు విద్యార్థులు ఒత్తిడికి లోనై బలవంతంగా మరణాన్ని ఆశ్రయిస్తున్నారు. తమిళనాడులోని సేలంలో కుజయ్యూర్‌కు చెందిన ధనుశ్‌ (19) నీట్‌కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకుని తీరా పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకుని ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్‌పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్‌ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్‌ తల్లిదండ్రులు ‘నీట్‌ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ‘నీట్‌ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్‌కు గురి చేసింది. నీట్‌కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ తెలపడం గమనార్హం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •