జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోనున్న HCL సంస్థ??

టెక్నాలజీ, ఐటీ సర్వీసెస్‌ను కెరీర్‌గా ఎంచుకోవాలని ఎదురుచూస్తున్న వారి కోసం జాబ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను ‘HCL ఫస్ట్ కెరీర్స్’ పేరుతో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రారంభించి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇది పేమెంట్ ప్రోగ్రామ్ అని సంస్థ తెలిపింది. అభ్యర్థులు ఉద్యోగాల్లో విజయవంతం కావడానికి అవసరమైన టెక్నికల్, ప్రాక్టికల్ స్కిల్స్‌తో పాటు పర్సనాలిటీ డెవలప్‌మెంట్ నైపుణ్యాల్లోనూ ఫ్రెషర్స్‌కు హెచ్‌సీఎల్ శిక్షణ ఇవ్వనుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు HCL టెక్నాలజీస్‌లో ఉద్యోగాలకు హామీ సైతం ఉంది.

ఈ ప్రోగ్రామ్ వ్యవధి ఆరు నెలలుగా ఉంటుందని హెచ్‌సీఎల్ ప్రకటించింది. ఈ శిక్షణ కోసం అభ్యర్థులు రూ.1.5 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వారి నుంచి నాలుగు దశల్లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. రిజిస్ట్రేషన్, ఆన్‌లైన్ కౌన్సిలింగ్, ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, ఆన్‌లైన్ ఇంటర్వ్యూ.. వంటి దశలను అభ్యర్థులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. HCL అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి.

దేశవ్యాప్తంగా ఎలాంటి అనుభవం లేని ఫ్రెషర్స్‌ లేదా రెండేళ్ల వరకు ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న BE, B.Tech, MCA, M.Tech, M.Sc (IT / Computer Science) డిగ్రీ హోల్డర్లు ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. B.Sc (IT/Computer Science), B.Voc (CS/IT/Software Development), BCA గ్రాడ్యుయేట్లలో.. లక్నో, నాగపూర్, విజయవాడ, మధురై నగరాలకు చెందిన, 0-2 ఏళ్ల అనుభవం ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకునే వీలుంది.

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చి, సంబంధిత నగరాల్లోనే ప్లేస్‌మెంట్స్ ఇస్తారు. 12వ తరగతి, గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో 65% అంతకంటే ఎక్కువ మార్కులు ఉండాలి. గ్రాడ్యుయేషన్ ఇయర్ 2018, 2019, 2020, 2021గా ఉన్నవారు మాత్రమే ఈ ప్రోగ్రామ్‌కు అర్హులు. ఎంపికైన అభ్యర్థులందరికీ IT ఇంజనీర్ జాబ్‌ కోసం ట్రైనింగ్ ఇస్తారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే : ముందుగా గూగుల్ లోకి వెళ్లి hcl first career అని సెర్ఛ్ చేయాలి. తర్వాత మరో వెబ్ పేజ్ ఓ పెన్ అవుతుంది. అందులో https://hclfirstcareers.com/ ఈ లింక్ పై క్లిక్ చేయాలి. అందులో టాప్ లో Apply అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ ఇవ్వగానే మరో పేజీ ఓపెన్ అవుతుంది. వెబ్ పేజి ఓపెన్ అయిన తర్వాత అందులో తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్ గా ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఆరు నెలల వ్యవధి ఉండే ఈ ప్రోగ్రామ్‌లోమూడు నెలల వర్చువల్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది. HCL టెక్నాలజీస్‌లో మరో మూడు నెలల ప్రొఫెషనల్ ప్రాక్టీస్ టర్మ్ ఉంటుంది. ఈ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌ను HCL అనుబంధ విభాగం అయిన HCL ట్రైనింగ్ అండ్ స్టాఫింగ్ సర్వీసెస్ నిర్వహిస్తుంది. కోర్సు ఫీజును బ్యాంకు లోన్ ద్వారా పొందే అవకాశం ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •