జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

70 శాతం సిలబస్‌తో ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షలు!!

ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఇంటర్‌ బోర్డు కీలక ప్రకటన చేస్తూ 70 శాతం సిలబస్‌ నుంచే ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రశ్నల్లో మరిన్ని ఛాయిస్‌లు పెంచామని, నమూనా ప్రశ్నా పత్రాలు, పరీక్షల మెటీరియల్‌ను http://tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు జలీల్‌ తెలిపారు.

ప్రస్తుతం ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఈనెల 25 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి. రెండో సంవత్సరంలో కాలేజీ మారిన విద్యార్థులు మొదటి సంవత్సరం ఫీజు చెల్లించిన కాలేజీ జోన్ పరిధిలోనే పరీక్ష రాయాలని జలీల్‌ తెలిపారు. విద్యార్థుల కెరీర్, ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొనే పరీక్షలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, భయం లేకుండా పరీక్షలు ఎదుర్కోవాలని జలీల్ తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •