జాతీయం (National) వార్తలు (News)

భారీ లాభాల్ని నమోదు చేసిన మార్కెట్ సూచీలు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు బుధవారం భారీ లాభాల్లో మునిగి తేలాయి. ఉదయమే సానుకూలంగా ప్రారంభమైన సూచీలు సమయం గడుస్తున్న కొద్దీ గరిష్ఠాలకు చేరుకొని జీవనకాల గరిష్ఠాలను నమోదుచేశాయి. ఉదయం సెన్సెక్స్‌ 60,619 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమై రోజులో 60,836 వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసి చివరకు 452 పాయింట్ల లాభంతో 60,737 వద్ద ముగిసింది. నిఫ్టీ 18,197 – 18,050 మధ్య కదలాడి చివరకు 169 పాయింట్ల లాభంతో 18,161 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ఐటీసీ, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్‌, ఎల్‌అండ్‌టీ, టెక్‌ మహీంద్రా, టైటన్‌, ఎంఅండ్‌ఎం, రిలయన్స్‌, టాటా స్టీల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫినాన్స్‌ షేర్లు రాణించాయి. హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, మారుతీ, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో షేర్లు నష్టాలు చవిచూశాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    9
    Shares
  • 9
  •  
  •  
  •  
  •