అంతర్జాతీయం (International) వార్తలు (News)

చైనాలో వర్షం బీభత్సం!!

చైనాలోని షాంక్సీ ప్రావిన్స్‌లో ఎడతెరపిలేకుండా కురిసిన వర్షాలకు 15 మంది మృతి చెందగా ముగ్గురు గల్లంతైనట్టు అధికారులు వెల్లడించారు. వరద ముంపు నేపథ్యంలో ఆ ప్రావిన్స్‌లోని దాదాపు 1.20లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అక్టోబర్‌ 2నుంచి 7వరకు రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి దాదాపు 10లక్షల మందికి పైగా జనం ప్రభావితమైనట్టు, ఈ వర్షాలకు 2,36,460 హెక్టార్లలో పంటలు నాశనం కావడంతో పాటు 37,700 ఇళ్లు ధ్వంసమైనట్టు, 6021 కి.మీల మేర రహదారులు దెబ్బతిన్నట్టు అధికారులు తెలిపారు. దీంతో చైనాకు 780 మిలియన్‌ డాలర్ల మేర ప్రత్యక్షంగా ఆర్థికనష్టం వాటిల్లినట్టు చైనా అధికార మీడియా సంస్థ జిన్హువా పేర్కొంది.

శుష్క ప్రాంతంగా ఉన్న షాంక్సీ ప్రావిన్స్‌లో నెల ప్రారంభంలో కురిసే సాధారణ వర్షపాతం కన్నా ఐదు రెట్లు ఎక్కువగా నమోదు కావడంతో పలు ఆనకట్టలు, రైల్వే లైన్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి కేంద్రంగా ఉండే ఈ ప్రాంతంలో 60 బొగ్గు గనులు మూతపడ్డాయి. ప్రస్తుతం విద్యుత్‌ కోతలతో సతమతమవుతున్న ఈ గనులు మూతపడటంతో ఇంధన సరఫరాపై ఆందోళన వ్యక్తమవుతోంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల నిమిత్తం అధికారులు 7.8 మిలియన్ డాలర్ల మొత్తాన్ని కేటాయించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    23
    Shares
  • 23
  •  
  •  
  •  
  •