రాజకీయం (Politics) వార్తలు (News)

తెలంగాణాలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల బదిలీ!!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసారు.వారిలో రవాణా, ఆర్ అండ్ బీ శాఖ బాధ్యతలను సుదీర్ఘ కాలంగా నిర్వహిస్తున్న సునీల్ శర్మను బదిలీ చేశారు. ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సునీల్ శర్మను నియమించారు. గృహనిర్మాణ శాఖ బాధ్యతలను కూడా ఆయన అదనంగా నిర్వర్తిస్తారు. ఇప్పటి వరకు ఇంధనశాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందీప్ కుమార్ సుల్తానీయాను ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేయగా పర్యాటక, క్రీడల శాఖ కార్యదర్శిగా ఉన్న కె.ఎస్‌. శ్రీనివాసరావు.. రవాణా, ఆర్ అండ్ బీ కార్యదర్శిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •