వార్తలు (News)

కదిరి పట్టణంలో… మద్యం మత్తులో తలెత్తిన గొడవలతో ఒకరి హత్య

– స్వయాన బంధువులే నిందితులు

– రంగంలోకి దిగిన పోలీసులు… దర్యాప్తు ముమ్మరం

– ఆస్తి గొడవలు లేదా అక్రమ సంబంధం కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనా

అనంతపురం:
కదిరి పట్టణంలో మద్యం మత్తులో తలెత్తిన గొడవలతో గురువారం రాత్రి ఒకరి హత్య చోటు చేసుకుంది.

కదిరిలోని ఆర్ ఎస్ రోడ్డులో ఉంటున్న అల్లావుద్దీన్ (30 స.,) అనే వ్యక్తిని స్వయాన ఇతని బంధువులే హత్య చేశారు.

ఇతను … భర్తను వదిలేసిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. సదరు మహిళ తండ్రి, మరొక వ్యక్తి కలసి రాత్రి అల్లావుద్దీన్ ఇంటికి వచ్చారు.

వీరు ఫుల్ గా మద్యం సేవించారు. ఆసందర్భంగా ఈ ముగ్గురి మధ్య గొడవలు తలెత్తాయి.

ఈ గొడవల్లో మిగితా ఇద్దరి చేతుల్లో అల్లావుద్దీన్ హతమయ్యాడు.

కదిరి పట్టణ సి.ఐ రామకృష్ణ ఘటనా స్థలం చేరుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఆస్తి గొడవలు లేదా అక్రమ సంబంధం కారణమై ఉండొచ్చని ప్రాథమిక అంచనాకు వచ్చారు.

త్వరలోనే నిందితులను అరెస్టు చేస్తామని సి.ఐ రామకృష్ణ వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.