చిరు అభిమానులకు శుభవార్త. ఇటీవల కరోనా బారినపడిన ప్రముఖ సినీ కథానాయకుడు చిరంజీవి కోలుకున్నారు. తాజాగా ఆయనకు కరోనా నెగెటివ్‌గా తేలింది. తాజాగా చేసిన వైద్య పరీక్షల్లో కరోనా నెగెటివ్‌ వచ్చిన విషయాన్ని స్వయంగా ఆయనే ట్విటర్‌లో అభిమానులతో పంచుకున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా వచ్చినట్లు తేలినా ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. దీంతో అనుమానం వచ్చి వైద్యులను సంప్రదించారు. తాజాగా చేసిన ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలో కరోనా లేదని తేలింది. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్థించి, తన క్షేమం కోరిన వారందరికీ చిరంజీవి కృతజ్ఞతలు చెప్పారు. ‘‘కాలం, కరోనా గత నాలుగురోజులుగా నన్ను కన్‌ఫ్యూజ్‌ చేసి నాతో ఆడేసుకున్నాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
చిరంజీవికి కరోనా వచ్చిందని తెలియడంతో మెగాస్టార్‌ కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు ఆయన త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్‌మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. అభిమానులు సైతం ఆయన ధైర్యంగా ఉండాలని కోరారు. మరోవైపు, చిరంజీవి సోదరుడు నాగబాబు ఇటీవల కరోనాని జయించిన విషయం తెలిసిందే.